Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘజియాబాద్ : కొవిడ్-19 రోగులకు సహాయపడేందుకు ఘజియాబాద్ గురుద్వారా 'ఆక్సిజన్ లాంగర్' ను ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ -19 కేసుల నేపథ్యంలో ఘజియాబాద్ ప్రజలను ఆదుకునేదుకు ఇందిరాపురంలోని గురుద్వార సమితి ప్రాణాలను రక్షించే ఆక్సిజన్ వాయువు కొరత తీర్చేందుకు నడుం బిగించారు. ప్రతి నిత్యం అన్నప్రసాద లాగర్ నిర్వహించడానికి బదులుగా ప్రత్యేకమైన ''ఆక్సిజన్ లాంగర్'' ను ప్రారంభించారు. ఈ బృందం ఇంటింటికి తిరుగుతూ సిలిండర్లు అవసరమైన వారు గురుద్వారాకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. గురుద్వారా వద్దకు వచ్చి వారికి కూడా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఈ బృందం ఇప్పటివరకు 250 కోవిడ్ -19 రోగులకు సహాయం చేసింది. గత రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో రోగులకు ఆక్సిజన్ అందించి వారి ప్రాణాలను నిలుపుతున్నది. వాలంటీర్లు తమ వాహనాల్లో ఆక్సిజన్ ఉపకరణాలను తరలిస్తూ ఉదయం నుంచి బిజీగా ఉన్నారు. తమ గురుద్వారా వాలంటీర్ల బృందం 25 పెద్ద సిలిండర్లను ఏర్పాటు చేయగలిగిందని, అయితే, ప్రస్తుతం తీవ్రత దృష్ట్యా అవి సరిపోవడం లేదని విచారం వ్యక్తం చేశారు ఇందిరాపురం గురుద్వారా సమితి అధ్యక్షుడు గుర్ప్రీత్ సింగ్. అవసరమైన వారికి సహాయం చేయడానికి తగినంత ఖాళీ సిలిండర్లు అందుబాటు లేకపోవడంతో సరైనరీతిలో అందజేయలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ అమ్ముకోవాలని కొందరు చూస్తున్నారని, అయితే పకడ్బందీగా ఆక్సిజన్ అందించే ప్రక్రియ చేపట్టినట్టు ఆయన తెలిపారు. గురుద్వారాకు రాకముందే రోగుల కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ తీసుకునేలా సమితి ఫోన్ నంబర్లను ప్రచారం చేసింది. దాంతో ఆక్సిజన్ సిలండర్లు బ్లాక్‌మార్కెటింగ్ అవడం లేదని పలువురు వాలంటీర్లు చెప్తున్నారు.