Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే చెన్నైలో పెను సంక్షోభమే : ప్రధానికి తమిళ సీఎం లేఖ
చెన్నై : తమిళనాడులోని ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లకు వెంటనే సప్లై నిలిపివేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమిళనాడులో ఆక్సిజన్ అవసరమవుతున్న యాక్టివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నందునా ఇక్కడ ఉత్పత్తయ్యే ఆక్సిజన్ ఇక్కడి అవసరాలకే సరిపోతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుండగా... మున్ముందు 450 టన్నుల మేర ఆక్సిజన్ అవసరమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. గతేడాది కరోనా మొదటి వేవ్ సందర్భంగా రాష్ట్రంలో 58వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని... ఇప్పుడా సంఖ్య లక్షకి చేరిందని గుర్తుచేశారు. కాబట్టి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లకు తమిళనాడు నుంచి కేటాయించిన ఆక్సిజన్‌ను నిలిపివేయాలన్నారు. నిజానికి రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసులకు అవసరమయ్యే ఆక్సిజన్ కంటే తక్కువ ఆక్సిజన్‌ను తమకు కేటాయించారని పేర్కొన్నారు.
'తమిళనాడులో ఇప్పటికే ఆక్సిజన్ వినియోగం 310 మెట్రిక్ టన్నులు దాటింది. కానీ రాష్ట్రానికి కేటాయించింది మాత్రం 220 మెట్రిక్ టన్నులే. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌లో 80 మెట్రిక్ టన్నులు తెలం గాణ,ఆంధ్రప్రదేశ్‌లకు పంపిస్తున్నారు. తమిళ నాడుకు ఆక్సిజన్ కేటాయింపు విషయంలో కేంద్రం అంచనా సరిగా లేదు. మాకంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలకు.. అందునా భారీ స్టీల్ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాలకు మా వద్ద నుంచే ఆక్సిజన్ కేటాయింపులు చేస్తున్నారు. సౌతిం డియాలో అత్యధిక కేసులున్న చెన్నై నగరానికి ఆక్సి జన్ సప్లై చేసే శ్రీపెరుంబుదూర్ ప్లాంట్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ మళ్లించడం సమం జసంగా లేదు.' అని ప్రధానికి రాసిన లేఖలో పళని పేర్కొన్నారు. తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను మళ్లించడం చెన్నైలో పెద్ద సంక్షోభానికి దారితీస్తుందనిపళనిస్వామి పేర్కొనడం గమనార్హం.