Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు 50 ట్వీట్లు తొలగింపు
- కేంద్రం ఆదేశాలు.. ట్విట్టర్ చర్యలు
న్యూఢిల్లీ : దేశంలో విజృంభిస్తున్న కరోనా నియంత్రణలో విఫలమైన మోడీ సర్కారు.. తనపై వచ్చే విమర్శలను ఏ మాత్రమూ సహించ లేకపోతున్నది. ఈ మేరకు ప్రభుత్వాన్ని విమర్శి స్తూ వస్తున్న ట్వీట్ల విషయంలో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది. ఇలాంటి ట్వీట్లను తొలగించా లంటూ ట్విట్టర్‌ను ఆదేశిం చింది. దీంతో ట్విట్టర్ సంస్థ.. కేంద్రాన్ని విమర్శి స్తూ ఉన్న దాదాపు 50 ట్వీట్లను తొలగించింది. వీటిలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, పశ్చిమబెంగాల్ మంత్రి మొలోరు ఘటక్ చేసిన ట్వీట్లు కూడా ఉండటం గమనార్హం. చిత్ర నిర్మాత అవినాశ్ దాస్, వినోద్ కప్రీల ట్వీట్లను కూడా సదరు సంస్థ తొలగించింది. అయితే, ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఇవన్నీ ట్విట్టర్ 'ధృవీకరించబడిన' ఖాతాలు కావడం గమనార్హం. ఈ ట్వీట్లు ముఖ్యంగా మోడీ సర్కారు వైఫల్యాన్ని తెలియబరుస్తూ చేసిన ట్వీట్లే. 'మోడీ రాజీనామా చేయాలి (రిజైన్ మోడీ)', మోడీ మేడ్ డిజాస్టర్ వంటి హాష్‌ట్యాగ్‌లతో ఈ ట్వీట్లు ఉన్నాయి. కుంభమేళపై నిశబ్ధం, కేసుల పెరుగు తున్నప్పటికీ బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలు, ఆరోగ్య వ్యవస్థ పతనం వంటి అంశాలపై స్పందిస్తూ ఈ ట్వీట్లు ఉన్నాయి. అయితే, ఈ ట్వీట్ల తొలగింపుపై నెటిజన్లు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసిన మోడీ ప్రభుత్వం.. విమర్శలను సైతం సహించలేక ఇలాంటి దారుణ చర్యలకు దిగిందని అన్నారు.