Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే, రానున్న రోజుల్లో దీని తీవ్రత సునామీ సృష్టి స్తుందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌లోని ఎపిడెమియాలజీ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ గిరిధర్ ఆర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కరోనా కొత్త వేరియంట్లే ప్రధాన కారణమని ఆయన తెలిపారు. కోవిడ్-19 కొత్త వేరియంట్లు రెట్టింపు వేగంతో వ్యాపి స్తున్నాయని తెలిపారు. రానున్న వారాల్లో నిత్యం ఆరు లక్షల నుంచి 10 లక్షల వరకు కొత్త కేసులు నమోదయ్యే అవకా శంముందని హెచ్చరించారు. ఈ వైరస్ నియంత్రణకు ప్రభుత్వం మరింత దూకు డుగా ముందుకు సాగాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్-ఈ ఐదు రాష్ట్రాల్లో మరో రెండు వారాల్లో నిత్యం నాలుగు నుంచి ఐదు లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. దీంతో పడకలతో పాటు ఆక్సిజన్ అధికమొత్తంలో కావాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వాలు ఇప్పుడే చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. బీహార్, యూపీల్లో కొత్త కేసులు అధికంగా గుర్తించపోవడానికి కారణం పరీక్షలు తక్కువగా జరపడం కూడా ఓ కారణమని ఆయన పేర్కొన్నారు.