Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి భారత పురావస్తు శాఖ(ఎఎస్ఐ) నమోదు చేసిన కేసులో పంజాబ్ నటుడు దీప్ సిద్ధూకి ఢిల్లీలోని ఒక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుహీల్ గుప్త ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అధికారులు అడిగినప్పుడల్లా విచారణకు వచ్చి వెళ్లాలని ఆదేశించారు. ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు తొలిసారి ఫిబ్రవరి 9న దీప్ సిద్దూని అరెస్ట్ చేశారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ నెల 16న ఆయనకు బెయిల్ లభించింది. అయితే భారత పురావస్తు శాఖ ఫిర్యాదు మేరకు దీప్సిద్ధూని కొన్ని గంటల్లోనే పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.