Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుకొచ్చిన గూగుల్, మైక్రోసాఫ్ట్
- అమెజాన్ నుంచి ఆక్సిజన్ కాన్సెనట్రేటర్లు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తామూ సాయం అందిస్తామని పలు బహుళజాతి కంపెనీలు ముందుకు వచ్చాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ సిఇఒలు సుందర్ పిచారు, సత్య నాదెళ్ల దేశ పరిస్థితిపై ట్విటర్ ద్వారా స్పందించారు. ''భారత్‌లో కరోనా సష్టిస్తున్న కల్లోలం తీవ్రంగా కలచివేస్తోంది. గూగుల్, గూగులర్స్ ఇప్పటికే గివ్ ఇండియా పేరుతో అత్యవసర ఔషధాలు, ఇతరాల కోసం యూనిసెఫ్‌కు రూ.135 కోట్లు అందించాము'' అని సుందర్ పిచారు పేర్కొన్నారు. గూగుల్ సంస్థ ఈ మొత్తాన్ని ఉద్యోగుల విరాళాలతో కలిపి అందిస్తుందన్నారు. అంతేకాకుండా... వైద్య సామాగ్రి కోసం యునిసెఫ్, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతునివ్వనున్నట్లు వెల్లడించారు. భారత్‌లో పరిస్థితి హదయ విదారకంగా ఉందని మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల ఆవేదన వ్యక్తం చేశారు. ''ప్రస్తుత క్లిష్ట సమయంలో భారత్ సాయం చేస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి కతజ్ఞతలు. మైక్రోసాఫ్ట్ కూడా సహాయక చర్యల కోసం తన గళాన్ని, వనరులను, టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఆక్సిజన్ పరికరాలను కొనుగోలు చేయడంలో సాయం చేస్తుంది'' అని సత్య నాదెళ్ల తెలిపారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో అమెజాన్ భారత్‌కు సాయం అందించేందుకు ఎసిటి గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్ పూణె ప్లాట్‌ఫామ్ ఫర్ కొవిడ్-19 రెస్పాన్స్‌లతో భాగస్వామ్యం కుదర్చుకుంది. ఇందులో భాగంగా అత్యవసరంగా సింగపూర్ నుంచి 8 వేల ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను తీసుకొస్తోంది. మరో 500 బై-లెవెల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (బైపాప్) మెషీన్లు కూడా వీటితోపాటే రానున్నాయి. ఈ సంస్థలన్నీ ఆ దిశగా భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా వీటిని భారత్‌కు తీసుకురానున్నట్లు అమెజాన్ వెల్లడించింది. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న ఆయా కొవిడ్ హాస్పిటల్స్‌కు అందించనున్నారు. ఈ మెషీన్లను భారత్‌కు తీసుకురావడానికి అయ్యే విమాన ఖర్చులను మొత్తం అమెజాన్ ఇండియా భరించనుంది. ఇవి కాకుండా మరో 1500 ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను అమెజాన్ ఇండియా సమీకరించి ఆయా హాస్పిటల్స్‌కు అందించనుందని అమెజాన్ ఇండియా గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు.