Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా : గత ఆరు దశలతో పోలిస్తే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. కడపటి వార్తలు అందే సమయానికి 75,06 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జమురియా నియోజవర్గంలో సిపిఎం అభ్యర్థిని ఐషీ ఘోష్, పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా టిఎంసి గూండాలు అడ్డుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వస్థలం భవానీపూర్‌తో సహా 34 స్థానాల్లో ఏడో దశ ఎన్నికలు జరిగాయి. ఇసి షెడ్యూల్ ప్రకారం ఏడో దశలో 36 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ముర్షిదాబాద్ జిల్లాలోని షాంషేర్గంజ్, జంగిపూర్ నియోజవర్గాల్లో సంయుక్త మోర్చా అభ్యర్థులు మరణించడంతో ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు వాయిదా వేశారు. సోమవారం ఎన్నికల్లో 86 లక్షలకు పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భవానీపూర్ నియోజవర్గం పరిధిలోని కోల్‌కతాలోని మిత్రా ఇనిస్టిట్యూట్ వద్ద ఒక పోలింగ్ బూత్‌లో ముఖ్యమంత్రి మమతా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర బలగాలకు చెందిన 796 కంపెనీలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య ఎన్నికలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29న జరిగే ఎనిమిదో దశతో బెంగాల్ ఎన్నికలు పూర్తి కానున్నాయి. మే 2న ఫలితాలు ప్రకటిస్తారు.
బెంగాల్లో పోలీస్ అధికారుల బదిలీ
పశ్చిమ బెంగాల్లో మరికొంత మంది పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం సోమవారం బదిలీ చేసింది. సరిగ్గా ఏడోదశ ఎన్నికలు జరుగుతుండగానే ఇసి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఆర్థిక నేర నిరోధక డైరెక్టరేట్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శాంతను సిన్హా బిశ్వాస్‌ను జల్పైగురి డిఐజి రేంజిలో క్రైమ్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేసినట్టు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను తారుమారు చేశారంటూ బిజెపి ఆరోపించడంతో సిన్హాపై బదిలీ వేటు పడింది. అసన్సోల్-దుర్గాపూర్ ఎసిపిగా ఉన్న శ్రీమంతకుమార్ బందోపాధ్యారును బోల్పూర్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. కష్ణగంజ్ సిఐగా ఉన్న నీహార్ రంజన్ రారును ముర్షిదాబాద్ పోలీస్‌స్టేషన్ కొత్త ఇన్స్పెక్టర్గా పంపించారు. ప్రస్తుతం అక్కడ సిఐగా ఉన్న అతీష్ దాస్‌ను పోలీస్ డైరెక్టరేట్‌కి బదిలీ చేశారు.