Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ సీఎంకు విజయన్ లేఖ
తిరువనంతపురం : ప్రస్తుతం జైల్లో వున్న కేరళ జర్నలిస్టు సిద్ధికి కప్పన్ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి చికిత్స అందించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. ఇటీవలే కప్పన్‌కు కోవిడ్ సోకింది. మథురలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మంచానికి ఒక జంతువులా తన భర్తను కట్టేశారని ఆరోపిస్తూ కప్పన్ భార్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి.రమణకు ఆదివారం ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే. తన భర్త మంచంపై చలనం లేకుండా ఉన్నాడని, గత నాలుగు రోజుల నుంచి ఆహారం కూడా తీసుకోవట్లేదని, టారులెట్కు వెళ్లలేకపోతున్నాడని కప్పన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె ఈ లేఖ రాశారు.
కేరళకు చెందిన 11మంది ఎంపీలు కూడా భారత ప్రధాన న్యాయమూర్తికి ఈ విషయమై లేఖ రాశారు. కప్పన్‌ను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించాలని కోరారు. ఆయన విడుదల కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను వెంటనే విచారించాల్సిందిగా వారు కోరారు. యుపిలో చోటుచేసుకున్న హథ్రాస్ లైంగికదాడి ఘటనను రిపోర్టు చేసుకుందుకు వెళ్తున్న కప్పన్‌ను యూపీ పోలీసులు యూఏపీఏ చట్టం ప్రయోగించి అరెస్టు చేశారు. హత్రాస్ దారుణ ఘటనపై మతపరమైన ఘర్షణలు రెచ్చగొట్టేందుకు గానూ కప్పన్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి కుట్ర పన్నారంటూ యూపీ పోలీసులు ఆరోపించారు. కాగా కప్పన్ విడుదల కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో వుంది. జబ్బుతో బాధ పడుతున్న తన తల్లిని చూసేందుకు, ఐదు రోజుల పాటు వుండేందుకు ఫిబ్రవరి 15న కప్పన్‌ను కేరళ వెళ్లడానికి అనుమతించారు.