Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలల అనుమతిచ్చిన తమిళనాడు సర్కార్
చెన్నై : ఆక్సిజన్ ఉత్పత్తి నిమిత్తం తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంతకు చెందిన స్టెరిలైట్ ప్లాంట్‌ను తాత్కాలికంగా తిరిగి ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యం వెదజల్లుతోందన్న కారణంతో 2018లో ఈ ప్లాంట్‌ను మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆక్సిజన్ ఉత్పత్తి కోసం మాత్రమే ప్లాంట్‌ను నాలుగు నెలల పాటు తెరవాలని నిర్ణయించారు. ఈ వివరాల్ని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లా కలెక్టర్ ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ప్లాంట్‌లో ఆక్సిజన్ ఉత్పత్తిని పర్యవేక్షించనుంది. తూత్తుకుడి ఎస్పి, సబ్‌కలెక్టర్, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్లు, ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు నిపుణులు, ఎన్జిఓలకు చెందిన పర్యావరణ నిపుణులు, స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమవేత్తలు ఈ కమిటీలో ఉంటారు. అఖిలపక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు విజయభాస్కర్, ఉదరు కుమార్, డిఎంకె ఎంపీలు కనిమోళి, ఆర్ఎస్ భారతి, కాంగ్రెస్ నేతలు కెవి తంగకబాలు, కె జయకుమార్, బిజెపి నేతలు ఎల్ మురుగన్, టికె రాఘవన్, సిపిఐ నేతలు ఆర్ ముథరసాన్, ఎం వీరపాండియన్ తదితరలు రాజకీయ నేతలు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్, డిజిపి జెకె త్రిపాఠీ, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు, ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.