Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంట్లో ఉన్నా నిబంధనలు ఆచరించాలి. కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా ప్రళయంగా మారుతున్నది. దీంతో కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇంట్లో ఉన్నా మాస్క్‌లు ధరించాల్సిన సమయమిదనీ, సెకండ్ వేవ్‌లో వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణం లో ప్రతి ఒక్కరూ భౌతికదూరం కచ్చితంగా పాటించాలని సూచిం చింది. మాస్క్‌లు ధరించినప్పుడు వ్యక్తుల మధ్య కోవిడ్ వ్యాపించదని పేర్కొంది. ప్రజలు అనవసర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారులు మాట్లాడారు. ''ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాల్సిన సమయం.. ఎవరినీ ఆహ్వానించకండి. అనవసరంగా బయట తిరగవద్దు'' అని నిటి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ సూచించారు. కుటుంబంలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వస్తే ఆ వ్యక్తి ఇంట్లో మాస్క్ ధరించి ఉండాల్సిందేనన్నారు. లేదంటే ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్ వ్యాపించవచ్చని హెచ్చరించారు. ఇంట్లో మాస్క్ పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు. లక్షణాలు ఉన్నవారు కోవిడ్ రిపోర్టులు వచ్చేదాకా వేచి చూడొద్దనీ.. వెంటనే ఐసోలేట్ కావాలని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సూచించారు. లక్షణాలు ఉన్నప్పటికీ ఆర్టీ పీసీఆర్‌లో కూడా నెగెటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. మాస్క్ పెట్టుకోకపోతే రిస్క్ ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.