Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా రోగుల బంధువులకు కేంద్రమంత్రి ఉచిత సలహా
- జోధ్‌పూర్ ఆస్పత్రికి సందర్శనకు వచ్చినపుడు ఘటన..
జోధ్‌పూర్ : కరోనా విజృంభణతో ప్రజలు పిట్టల్లా.. రాలిపోతుంటే.. బీజేపీ నేతల వింతవాదనలు వివాదాస్పదమవుతు న్నాయి. తొలిదశ కరోనా వచ్చినపుడు గో మూత్రం తాగాలనీ.. గంగా నదిలో మునగాలనీ.. ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేయగా.. పళ్లాలు వాయించమనీ, చప్పట్లు కొట్టమనీ.. గో గో కరోనా అనమన్నారు. ఇపుడు సెకండ్‌వేవ్ సునామీలా ముంచుక ొస్తే.. బాలాజీకి కొబ్బరికాయ కొడితే..దేవుడు ప్రతిదీ నయం చేస్తాడంటూ కేంద్రమంత్రి అనటంతో.. కరోనా రోగులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. జోధ్‌పూర్ ఎంపీ, కేంద్ర జలవిద్యుత్ శాఖమంత్రి గజేంద్రశేకావత్ రాజస్థాన్‌లోని సర్కారు దవాఖానాకు సందర్శనకు వెళ్లారు. తమ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కావటంతో.. ఇద్దరు మహిళలు.. చొరవచూపి, మా బంధువులకు వైద్యం ఇప్పించమని కోరారు. వైద్యులు వారి పనిచేస్తున్నారు. మీరు బాలాజీ మహరాజ్‌కు నైవేద్యం అర్పించమని ఉచితసలహాఇచ్చి.. అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఇక రాజస్థాన్‌లో గత వారంరోజుల్లోనే సుమారు లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్‌లో అమ్ముడవుతు న్నాయని మీడియా మంత్రి దృష్టికి తీసుకు రాగా పరిశీలిస్తామంటూ వెళ్లిపోయారు.