Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీజీ ! మీ రాజకీయ ఇమేజ్‌ని, మీ కోపాన్ని మర్చిపోండి !
- రోగుల కనీస అవసరాలు తీర్చండి
- ప్రభుత్వానికి ఓ వైద్యురాలి వేడుకోలు !
న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో దేశం ఇదివరకెన్నడు చూడని ఆరోగ్య సంక్షోభంలోకి జారుకుంటోంది. మరీ ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో అనేక మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్న హృదయవిదారకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులపై దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హర్టిమెడిస్ ఆస్పత్రి ఎండీ, డాక్టర్ దేవ్లినా చక్రవర్తి ఆస్పత్రుల్లో రోగుల ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ''గాలి సరఫరా లేని ఓ సోరంగంలో ప్రాణాలు నిలుపుకోవడానికి క్షీణిస్తున్న ప్రాణవాయువుతో పోరాడటం వారానికి దగ్గర కావస్తున్నది. ఇది నేడు దేశం మొత్తం ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇది సూచనార్థక మార్గం కాదు. ఇది ఒక విపత్తు. రాజకీయం కాదు. సంచలనాత్మకం కాదు. వైద్య సహాయ సౌభ్రాతృత్వం కోసం యావత్ దేశం కేకలు వేస్తోంది. పడకలు, వెంటిలేటర్లు, కరోనా టీకాలు, కరోనా చికిత్స మందులు (రెమిడెసివిర్ ఇతర డ్రగ్స్)ల కోసం. కనీస వైద్య అవసరాల్లో ఉన్నవాటిని అందించండి. మీ కథనాల్లో అన్ని ఉన్నాయి కానీ మేము దానిపైనే పనిచేస్తున్నాం'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
అలాగే, ''ఈ సమస్య స్వభావాన్ని అతిగా అంచనా వేయలేము. కానీ ఇది అతి పెద్దది. అన్ని వైపులకీ విస్తరించింది. ఒక రాత్రిలో ఇది పరిష్కారం కాకపోవచ్చు. ఆక్సిజన్ కోసం రేపటి వరకు రోగులు పడిగాపులు పడలేరు. కాసేపు మీ రాజకీయ ఇమేజ్ను, మీ కోపాన్ని మర్చిపోండి. దేశద్రోహం, దేశవ్యతిరేకులన్న ప్రేలాపనలు మీరు పక్కనబెడితే పనులు సక్రమంగా అవుతాయి. నేను సంభాషించిన ప్రతిసారి మీరు మరింత అనాసక్తిగా,సందిగ్ధంగా, అస్పష్టంగా, కోపంగా కనిపిస్తారు. కానీ భారత ఆస్పత్రులు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా పొందే వరకు నా అభ్యర్థన ఆగదు. నిరంతరాయంగా ఉంటుంది. మన రోజువారీ మనుగడ ప్రమాదకరంగా మారింది. ఆరోగ్య కార్యకర్తలు 24 గంటలు పనిచేస్తూ అలసటతో ఉన్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోగుల ప్రవేశాలను నిలిపివేయాల్సి వస్తోంది. మేము నిస్సహాయంగా మిగిలిపోతున్నాం. మా రోజువారి ఆక్సిజన్ కోటా పొందడానికి మేము వందలాది కాల్స్ చేస్తాం. సందేశాలు పంపుతాం. మీరు కొన్ని గంటలకు మాత్రమే సరిపడ పంపుతారు. ఎందుకు ఈ అంతరాయ సమస్యలు? రోగుల కనీస అవసరాలు తీర్చండి'' అంటూ గురుగ్రామ్‌లోని ఆర్టెమిస్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ దేవ్లినా చక్రవర్తి ఆవేదన వ్యక్తం చేశారు.