Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ సందేశాలు పోస్టు చేస్తున్న ట్విట్టర్ ఖాతాపై నూతనంగా ఎన్నికైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు ట్విట్టర్ కానీ, ఇతర సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు. అయితే ఎన్వి రమణ పేరుతో ఖాతాను తెరచి.. ఇప్పటి వరకు 98 ట్వీట్లను చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవల చేసిన ఓ ట్వీట్ ...నకిలీ సోషల్ మీడియా ఖాతాను బయటపెట్టింది. ఆ ట్వీట్లో 'అజిత్ దోవల్ జోక్యం కారణంగా.. భారత్‌కు ముడిపదార్ధాలు రవాణా చేసేందుకు అమెరికా సిద్ధమైంది' అని ఉంది. తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించడమైంది. ఇది గుర్తించిన ఆయన ఈ ఖాతాపై ఫిర్యాదు చేశారు.