Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌ను కరోనా ముంచెత్తడంతో భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో సైనిక దళాల్లో సేవలందించి రిటైర్డ్ అయిన ఆరోగ్య సిబ్బందిని తిరిగి విధుల్లోకి ఆహ్వానిస్తోంది. వారి నివాసానికి దగ్గర్లోనే కోవిడ్ సెంటర్ల వద్ద నియమించనున్నట్లు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ప్రధాని మోడీకి తెలిపారు. కరోనాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సైనిక దళాలు చేస్తున్న కార్యాచరణ గురించి మోడీ సోమవారం నిర్వహించిన సమీక్షలో రావత్ ఈ వివరాలు వెల్లడించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సైన్యంలో లభిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లను అవసరమైన ఆసుపత్రులకు తరలించడంలో రిటైర్డు ఆరోగ్య సిబ్బంది సాయం ఉంటుందని రావత్ మోడీకి వివరించారు. అధిక ఒత్తిడికి గురవుతున్న ఆరోగ్య కార్యకర్తలకు మద్దతుగా ఆసుపత్రుల్లో వీరిని నియమిస్తామని రావత్ తెలిపారు. డాక్టర్లకు సాయంగా నర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు. సైన్యంలో పెద్ద సంఖ్యలో మెడికల్ ఏర్పాట్లును చేపడుతున్నామని, సాధ్యమైన పౌరులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ, విదేశాల్లో ఆక్సిజన్, ఇతర నిత్యావసర వస్తువుల రవాణా చేసేందుకు వైమానిక దళం చేస్తున్న కార్యాకలాపాలను కూడా మోడీ సమీక్షించారు. అదేవిధంగా అత్యవసర సహాయ మార్గాల ద్వారా సంప్రదింపులు జరిపేలా ఇతర మెడికల్ అధికారులను కోరాలని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది.