Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో విషాదం
- విజయనగరంలో ఘోరం
- మిగతా రోగులను ప్రయివేటు ఆస్పత్రులకు తరలింపు
విజయనగరం : విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆక్సిజన్ అందకపోవడంతో ఇక్కడ ఆరుగురు రోగులు మరణించారు. అయితే 10 మంది మరణించివుంటారని స్థానికులు ఆందోళన చెందుతు న్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని రెండు ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఒ గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి నాగభూషణం విలేకరులతో మాట్లాడుతూ ఆక్సిజన్ అంద క జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు, ఇక్కడి నుండి తరలించిన మరో పేషెంట్ ప్రయివేట్ ఆస్పత్రిలో మరణించారని తెలిపారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఇద్దరే మరణించారని ఆ మరణాలకు కూడా ఆక్సిజన్ లేకపో వడం కారణం కాదని అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల సమ యంలో కరోనా రోగులకు అందిస్తున్న ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. అక్కడే చికిత్స పొందుతున్న సీపీఐ(ఎం) పార్వతీపురం ప్రాంత జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి దీనిపై వెంటనే పార్టీ జిల్లా నాయకులకు సమాచార మిచ్చారు. దీంతో సీపీఐ(ఎం) విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, నాయకులు రెడ్డి శంకరరావు, టివి రమణ ఆస్పత్రి వద్దకు వెళ్లారు.
కలెక్టర్ హరిజవహర్‌లాల్‌కు ఫోన్ చేసి విషయం తెలిపారు. 4.30 గంటల సమయంలో కలెక్టర్ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి వెళ్లిపోయారు. అప్పటికే అక్సిజన్ అయిపోవడంతో కొందరు రోగుల పరిస్థితి క్లిష్టంగా మారింది. సిలిండర్లకోసం బంధువులు వెతికినా ఫలితం కనిపించలేదు. ఉదయం 7గంటల సమ యానికి కూడా ఆక్సిజన్ అందుబాటులోకి
రాకపోవడంతో కొందరు చనిపోయినట్టు తెలిసింది. ఉదయం మరోసారి కలెక్టర్ ఆస్పత్రికి వచ్చి వెళ్లిన తరువాత మృత దేహాలను తరలిం చారని రోగుల కుటుంబ సభ్యులు తెలిపారు. విలే కరులతో మాట్లాడిన కలెక్టర్ లోప్రెజర్లో ఆక్సిజన్ సప్లయి అవ్వడం వల్ల ఈ సమస్య వచ్చిందన్నారు. పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో విశాఖలో ఒక ఆస్పత్రి ఏర్పాటుకు అక్కడి కలెక్టర్‌తో మాట్లాడామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆక్సిజన్ కొరత లేకపోతే మిగిలిన రోగులను ఇతర ఆస్పత్రులకు ఎందుకు తరలిస్తున్నారన్న ప్రశ్నలకు అధికారులు జవాబు చెప్పడం లేదు విశాఖ స్టీల్ ప్లాంటు నుంచి యుద్దప్రాతిపదికన సోమవారం మధ్యాహ్నం ఒక ట్యాంకు ఆక్సిజన్ జిల్లాకు చేరుకుంది.