Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తూత్తుకుడిలోని స్టెరిలైట్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి వేదాంతకు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. 'ప్రస్తుత సమయంలో దేశమంతా ఐక్యంగా ఉండాలి' అని జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. 'హైకోర్టులకు సుప్రీంకోర్టు అనుబంధంగా పని చేస్తుంది. దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో సుప్రీంకోర్టు నిశ్శబ్ధంగా ఉండలేదు. హైకోర్టులకు పరిపూరకమైన పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం. హైకోర్టులు విలువైన పాత్ర పోషిస్తున్నాయి' అని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి కోసం వేదాంతకు అనుమతి ఇవ్వడంపై రాజకీయ వివాదం చేయకూడదని సుప్రీంకోర్టు సూచించింది. రాజకీయ, కార్యనిర్వహక భాగస్వామ్యులతో విసృత్తంగా చర్చించిన తరువాతే వేదాంతకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సుప్రీంకోర్టు తెలిపింది.