Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. కేసులు, మరణాలు అధికమవుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా దక్షిణ ఢిల్లీలో ఇటీవలే అందుబాటులోకి తీసుకుచ్చిన సర్ధార్ పటేల్ కోవిడ్-19 కేర్ సెంటర్‌కు కరోనా రోగులు పోటెత్తారు. దీంతో మంగళవారం ఉదయం అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఉదయం ఆస్పత్రిని తెరవడానికి ముందే చాలా మంది రోగులు చేరడానికి ఆస్పత్రి గేటు వద్ద గుమిగూడారు. ఇది ఢిల్లీలో ఆస్పత్రుల్లో పడకల కొరత, వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. రాజధానిలో ఆక్సిజన్, పడకల కొరతతో ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలోనే ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో చేరడానికి రోగులు ప్రీ అడ్మిషన్ కోసం నమోదుచేసుకోలేదనీ, దీంతో చాలా మందిని లోపలికి అనుమతించలేదని అధికారులు తెలిపారు. ఈ కేంద్రంలో ప్రవేశాలకు ముందుగా హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు నమో దుచేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో సుదూర ప్రాంతాల వారు సైతం ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం 500 పడకలు ఉన్నందున ఇక్కడికి వచ్చిన చాలా మందిరి అడ్మిషన్లు కల్పించ లేకపోయామని వైద్యులు తెలిపారు. తమ పేర్లను రిజిస్టర్ చేసుకో వడానికి రోగుల నుంచి భారీగా కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే పడకలు పెంచుతామని ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది.