Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మే నెలాఖరుకు మన దేశంలో విని యోగంలోకి వస్తుందని భావిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీ తెలిపింది. అప్పటికి రష్యా నుంచి ఎఫ్‌డిఐలో భాగంగా స్టాకు వస్తుందని పేర్కొంది. డాక్టర్ రెడ్డీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఎఫ్ఐ) సమన్వయంతో మనదేశంలో క్లినికల్ ట్రయల్స్ గత ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన సంగతి తెలిసిందే.
మే నెలలో దేశంలో కరోనా విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 4 నుంచి 8వ తేదీల్లో రోజుకు 4.4 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, మే 14 నుంచి 18 తేదీల్లో రోజుకు 10 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కాన్పూర్, హైదరాబాద్‌లకు చెందిన ఐఐటి నిపుణులు అంచనా వేశారు. అస్సాంలో మంగళవారం రాత్రి నుంచి మే 1 వరకూ రాత్రి కర్ఫ్యూను అమల్లోకి తెస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఈ నైట్ కర్ఫ్యూ విధించారు. అన్ని దుకాణాలు, మార్కెట్ స్థలాలను సాయంత్రం 6 గంటల్లోపే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో సహా ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.
సిడ్నీ నుంచి ఖాళీగా ఎయిర్ ఇండియా విమానం
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి మంగళవారం ఒక ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులు లేకుండా ఖాళీగా వచ్చింది. ఎయిర్ ఇండియా విమాన సిబ్బం దిలో ఒకరికి కరోనా నిర్ధారణ కావడంతో సిడ్నీ విమా నాశ్రయ అధికారులు ఈ నిర్ణయం తీసు కున్నారు. కరోనాసోకిన సిబ్బంది కార్వంటైన్‌లో ఉన్నారు.
ఆక్సిజన్ సప్లయి పర్యవేక్షణకు సిఐఐ టాస్క్ఫోర్సు
దేశంలో ఆక్సిజన్ సప్లయి ఛైన్‌ను పర్యవేక్షించడానికి కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సిఐఐ) ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ టాస్క్ ఫోర్స్ కలిసి పనిచేస్తుందని సిఐఐ తెలిపింది.