Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం
న్యూఢిల్లీ : జర్నలిస్టు సిద్ధికి కప్పన్ వైద్య నివేదికలు అందచేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. గత ఏడాదిలో దళిత మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిన హాథ్రాస్‌కు వెళ్తుతున్న సమయంలో కప్పన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాత్రూమ్లో పడిపోయిన తరువాత కప్పన్‌ను ఆస్పత్రిలో మంచంపై ఒక జం తువులా బంధించారని, అతనికి కరోనా కూడా సోకిందని కేరళ జర్నలిస్ట్ యూనియన్ ఆరోపించింది. ఈ ఆరోప ణలను యూపీ ప్రభుత్వం ఖండించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కప్పన్ వైద్య నివేదికలను బుధవారం అందచేస్తామని తెలిపింది. దీంతో ఈ కేసు విచార ణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.