Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా పేషెంట్లను కాపాడండి
- కర్నాటకలో కార్పొరేట్ ఆస్పత్రి తీరుపై యువతి ఆక్రందన
బెంగళూరు : వైద్యులంటే ప్రాణం పోసేవారను కుంటాం. కార్పొరేట్ వైద్యం వచ్చాక రోగి జేబు నుంచి ఎంత పిండుకుందామా అన్న భావనే ప్రతిచోటా కనిపిస్తున్నది. ఇక మహమ్మారి చుట్టుముట్టాక.. వైద్యం మరింత ఖరీదైపోయింది. వైరస్ సోకి.. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆస్పత్రికి వచ్చిన రోగి ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు, సిబ్బంది ప్రాణాలు తీసేస్థాయికి దిగజారారంటే నమ్ముతారా.. కానీ ఇది నిజం. కర్నాటకలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ సోకిన ఓ పేషెంట్‌ను గొంతునొక్కే చంపేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్చేస్తున్నది.
'రోగులు ఇక్కడ కరోనాతో చనిపోవటంలేదు. వారిని చంపేస్తు న్నారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రాణాలు కాపాడండి. అమాయ కరోగుల ప్రాణాలు తీస్తున్న ఆస్పత్రిపై కఠినచర్యలు తీసుకోండి... అంటూ ఓ యువతి కన్నీరుమున్నీరై విలపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. ఈ ఆస్పత్రిలో రోజూ కనీసం ఏడుగురు పేషెంట్లను చంపేస్తున్నారు. 8 లక్షలు కట్టి మా నాన్నను చేర్పించా. ఆస్పత్రి సిబ్బందే గొంతునొక్కి చంపేశారు. ఆస్పత్రిలో వైద్యం చేస్తారని తీసుకొస్తే.. నాన్నను కోల్పోయా. కనీసం వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లను కాపాడండి..అంటూ ఆ యువతి మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియోలోనే మరో ఆస్పత్రిలో కరోనా పేషెంట్‌పై సిబ్బంది పిడిగుద్దులు కురిపిస్తూ అతి కిరాతకంగా మట్టుబెట్టారు. కరోనాతో కాసులు దండుకుంటున్న కార్పొరేట్ దవాఖానాలు బరితెగిస్తున్న తీరుపై దర్యాప్తుకు కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఎలాంటి ప్రకటన చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్క
ఘజియాబాద్‌లో ఘోరం..
కరోనాతో మృతిచెందిన వారిని శ్మశానవాటికల్లో మూకుమ్మడిగా దహ నం చేస్తున్న అనేక దృశ్యాలు ఇప్పటికే సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. అలాగే శ్మశానవాటికల్లో మతదేహాలు పేరుకుపోతు న్నాయి. ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో హండన్ శ్మశాన వాటికకు కూడా వందల సంఖ్యలో మతదేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హండన్ శ్మశానవాటిక వద్ద ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియల కోసం క్యూలైన్లో ఉంచిన ఓ మృతదేహాన్ని కుక్క పీక్కుతింటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో శనివారం ఆయన్ను ఓ ప్రయివేటు వైద్యశాలకు మార్చామని ఆయన సహౌద్యోగి త్రిలోకి సింగ్ చెప్పారు. కాగా, ఆయన ఆదివారం మృతిచెందారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం మృతదేహాన్ని పీపీఈ కిట్, పాలిథిన్ కవర్లో చుట్టి కుటుంబసభ్యులకు అప్పగించారు. 'ఆదివారం అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి అంబులెన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. చివరికి సుమారు 8 గంటలకు హిండన్ శ్మశానవాటికకు చేరుకున్నాం. అప్పటికే అనేక మృతదేహాలు క్యూలో ఉన్నాయి. ఉదయం 10 గంటలకు టోకెన్ ఇస్తామని చెప్పారు. మృతదేహాన్ని బయట ప్లాట్‌ఫాం మీద ఉంచాం' అని సింగ్ తెలిపారు. ఈ సమయంలో ఒక వీధి కుక్క పీపీఈ కిట్‌లో ఉంచిన మృతదేహం ముఖాన్ని పీక్కుతిన్నది. దీంతో బంధువులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులపై విచారణ జరిపించాలని నిరసనకు దిగారు. జంతువులు రాకుండా శ్మశానం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో చివరికి నిరసనను విరమించారు.
కోవిడ్ ఆస్పత్రిలో ఘర్షణ..
అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై రోగి బంధువులకు, ఆస్పత్రి సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకున్న వైనం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కోవిడ్ చికిత్స కోసం రవిప్రకాశ్ అనే వ్యక్తి చిరాయు ఆస్పత్రిలో చేరారు. బిల్లు ఎక్కువ వేశారనే విషయమై రోగి బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీయడంతో వివాదం రాజుకుంది. ఇరువర్గాలు ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించారు. ఆ కోవిడ్ ఆస్పత్రిలోని ఘర్షణ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల ముందే కొట్టుకున్న డాక్టర్-నర్స్.
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. అలుపెరుగకుండా వైద్యులు, నర్సులు కోవిడ్ బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. పని ఒత్తిడి పెరిగి ఒక్కోసారి వారు భావోద్వేగాలకు లోనవుతున్నారు. విధులను నిర్వర్తించడం వారికి తలభారంగా మారుతోంది.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్‌కు, నర్సుకు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు దూషించుకున్నారు. చివరికి సహనం కోల్పోయి నర్సు డాక్టర్ చెంపపై గట్టిగా కొట్టింది. దాంతో డాక్టర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్‌జీ మిశ్రా ఘటనపై ఇద్దరిని వేర్వేరుగా విచారించారు. రామ్‌జీ మిశ్రా మాట్లాడుతూ.. కొట్లాడుతున్న డాక్టర్, నర్సు ఇద్దరితో విడివిడిగా మాట్లాడానని, ఇద్దరూ కూడా పని ఒత్తిడిని తట్టుకోలేకనే సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించామని చెప్పినట్టు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.