Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మే 2 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో... ఎన్నికల్లో గెలుపొందిన ఆయా పార్టీ కార్యకర్తలు జరుపుకునే విజయోత్సవ సంబరాల పై నిషేధాన్ని విధిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న వేళ.. ఈ నిషేధాన్ని అమలుచేయను న్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గెలుపొందిన అభ్యర్థితోపాటు మరో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే అనుమతినివ్వనున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గెలుపొందిన అభ్యర్థి (అతను, ఆమె) కి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నట్టు వెల్లడించింది.