Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య నిజానికి అంతకు 30 రెట్లు అధికంగా ఉంటున్నాయని మీడియా సంస్థ సీఎన్ఎన్ తెలిపింది. ఆ మేరకు ఆధారాలతో ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం భారత్‌లో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 52 కోట్లు, మరణాలు 9.90 లక్షలుగా ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మంగళవారానికి మొత్తం 1.76 కోట్ల మంది కరోనా బారిన పడగా, 1.98 లక్షల మంది కొవిడ్‌తో మృతిచెందారు. భారత్‌లో ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలకు మరో 30 రెట్లు ఎక్కువగా కేసులు, మరణాలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు నిజాలను దాచిపెడుతున్నాయని ఆరోపిస్తున్నారు.
వనరుల లేమి, మానవ తప్పిదాలు, పరీక్షలు తక్కువగా ఉండడం వంటి కారణాలతో లెక్కలు తక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. అధికారిక లెక్కలకంటే కేసుల సంఖ్య, మరణాలు ఎక్కువగానే ఉన్నాయని ఢిల్లీలోని సెంటర్ ఫర్ డిసీస్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ డైరెక్టర్ రామనన్ లక్ష్మీనారాయణన్ అన్నారు. సెకండ్‌వేవ్‌లో అధికారిక లెక్కలకు మంచి మరణాలున్నాయన్నారు. వాషింగ్టన్ వర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్స్ భారత్ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. మే రెండోవారానికి భారత్‌లో మరణాలు భారీగా నమోదయ్యే సూచనలున్నాయనీ, రోజువారీ మరణాల సంఖ్య 13 వేలకు చేరుకోవచ్చని అంచనా వేసింది. కరోనాతో ఇళ్లలో చనిపోయేవారి లెక్కలను ప్రభుత్వం బయటపెట్టడంలేదని కమ్యూనిటీ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ హేమంత్ షేవాడే పేర్కొన్నారు. హౌంఐసోలేషన్లో ఉన్నవారు చనిపోతే, వాటిని కరోనా మరణాలుగా లెక్కించడంలేదన్నారు.