Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్ నెగిటివ్ రిపోర్టు, లేదా టీకా రెండు డోసులు తీసుకున్న వారికే మే 2న కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశాలు జారీచేసింది.
అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చిన తరువాత విజేతలు ఎలాంటి సంబరాలు చేసుకోవడానికి వీల్లేదని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఆర్టి-పీసీఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్టు లేదా, ర్యాపిడ్ య్యాంటిజెన్ నివేదిక చూపిస్తేనే కేంద్రం లోపలికి అనుమతి ఉంటుంది. టీకా రెండుడోసులు పొందిన ధ్రువపత్రాన్ని అయినా సమర్పించాల్సి ఉంటుంది.