Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఒడిషా విజ్ఞప్తి
భువనేశ్వర్ : రాష్ట్రంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్ఎస్) మోహరించినందుకు వసూలు చేసిన రూ.4,561 కోట్లను మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఒడిషా ప్రభుత్వం గురు వారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నా యక్ ప్రధాని మోడీకి లేఖ రాసారు. మావోయిస్టులు తదితర గ్రూపుల తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఇ) జాతీయ సమస్య అని, అంతర్గత భద్రతా ముప్పును పరిష్కరించుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. సిఎపిఎఫ్ మోహరింపుపై వసూలు చేసిన మొత్తాన్ని మాఫీ చేయాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని లేఖలో మోడీని పట్నాయక్ కోరారు. 2015లో కూడా ఒడిషా ప్రభుత్వం ఇలాంటి విజ్ఞప్తి చేయగా, అప్పట్లో కేంద్ర హోం శాఖ తిరస్కరించింది. జమ్ముకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు వంటి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు సీఏపీఎఫ్ఎస్లను మోహరించినందుకు పూర్తి చార్జీలు భరించాల్సిందేనని స్పష్టం చేసింది.