Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన కిరాతకుడు
విజయవాడ: విజయవాడ నగరంలోని సింగ్‌నగర్ పాయకాపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్యను, ఇద్దరు పిల్లలను దారుణంగా ఓ కిరాతకుడు హత్య చేశాడు. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం... పాత ఇనుము వ్యాపారం చేస్తోన్న బుగతా మోహన్ తన కుటుం బంతో వాంబే కాలనీ డి-బ్లాక్ 373 నంబర్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సొంత ఆటో కూడా ఉంది. తన భార్య బుగతా నేలవేణి (26)ని కట్టర్‌తో దవడ కింద బలంగా పొడిచి హత్య చేశాడు. కుమారుడు రేవంత్ కుమార్ (సాయి) (7), కూతురు జాన్సీ (5)లను బెడ్ మీదే చున్నీతో గట్టిగా బిగించి చంపేశాడు. అనంతరం తన ఆటోలో వాంబే కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు చనిపోవటానికి వెళ్లాడు. అయితే, భయపడి తిరిగి సింగ్‌నగర్ ప్లైఓవర్ డౌన్ వద్దకు వేగంగా వస్తున్న సయయంలో గోడకు ఆటో బలంగా ఢకొీంది. దీంతో, మోహన్ తల, చేతులకు తీవ్ర గాయాల య్యాయి. ఈ విషయాన్ని మోహన్ తండ్రి రాజారావుకు స్థానికులు సెల్ ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆ సమయంలో ఆర్టిసి బస్టాండ్ వద్ద కిరాయి కోసం ఆటోతో రాజారావు ఉన్నాడు. దీంతో, ఆయన తన చిన్న కొడుకు జోగేంద్రకు ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. తన అన్నకు జరిగిన ప్రమాదంపై వది నకు చెప్పేందుకు మోహన్ ఇంటికి జోగేంద్ర వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో కిటికీలో నుంచి తొంగి చూశాడు. తన వదిన, ఇద్దరు పిల్లలు విగత జీవులై కనిపించారు.