Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌పై మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు నింపిన కారును నిలిపేందుకు నిందితునికి సహాయం చేసినందుకు, ఇతర అవినీతి ఆరోపణలతో పాటు ఫిర్యాదుదారుడిని వేధించిన కేసులో పరమ్బీర్సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అకోలా జిల్లా పోలీస్ ఇన్స్పెక్టర్ భీమ్రావ్ ఘాడ్జే నమోదు చేసిన ఈ కేసులో డిసిపి పరాగ్ మనేరాతోపాటు మరో 33 మందిని చేర్చారు. నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం, షెడ్యూల్డ్ తెగలు, అత్యాచార నిరోధక చట్టం -1989 కింద 27 సెక్షన్లు నమోదుచేశారు. అకోలా పోలీస్ స్టేషన్ల్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను థానే పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. పరమ్‌బీర్ ప్రస్తుతం హౌం గార్డ్స్ విభాగానికి అధిపతిగా ఉన్నారు.