Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఫోటోచూస్తే.. హిరోషిమా..లేక నాగసాకి పై అణుబాంబు వేసిన నాటి చిత్రంలా కనిపిస్తున్నది. కానీ ఇది కరోనా ఉగ్రరూపానికి తార్కాణం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఢిల్లీలోని ఓ శ్మశానవాటికలో కోవిడ్ మృతులకు దహససంస్కారాలు నిర్వహిస్తుండగా.. పీపీఈ సూట్ ధరించి ఓ మృతుడి బంధువు అక్కడి నుంచి బయటకువెళుతున్నాడు. ఢిల్లీ శ్మశానవాటికల్లో కాష్టానికి క్యూలు.. టోకెన్లు.. బంధువుల పడిగాపులు.. ఇంతటి ఘోర మహమ్మారి విపత్తుకు మోడీ ప్రభుత్వ అలసత్వమే కారణమని న్యాయస్థానాలు, విదేశీ మీడియా చెబుతున్నా.. బీజేపీ పాలకులు నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.