Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలదే హవా
- కేరళలో చరిత్ర సృష్టించనున్న ఎల్డీఎఫ్
- తమిళనాడులో డీఎంకే, వామపక్ష కూటమికే అధికారం
- బెంగాల్ తృణమూల్‌కే
- అసోం, పుదుచ్చేరిలలో బీజేపీకి మొగ్గు
- మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి
- నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్, తిరుపతిలో వైసీపీ..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఎదురుగాలి వీచింది. మోడీతో పాటు హోంమంత్రి అమిత్‌షా వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ప్రచారం నిర్వహించినప్పటికీ బీజేపీకి ఈ ఎన్నికలు తీవ్ర ఆశాభంగాన్నే మిగల్చనున్నాయి. వివిధ మీడియా సంస్థలు గురువారం సాయంత్రం విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో ఈ విషయం స్పష్టమైంది. కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించనుందని అన్ని సర్వేలు తేల్చేశాయి. ఈ రాష్ట్రంలో ప్రాభావాన్ని పెంచుకునేందుకు కమల నాధులు పన్నిన అన్ని పన్నాగాలను ప్రజా నీకం తిప్పికొట్టనుంది. కీలకమైన సమయాల్లో మతోన్మాదం పట్ల మెతక వైఖరి అవలంబించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేం దుకు బీజేపీకి తన వంతు సహకారమందిం చిన కాంగ్రెస్‌కూ కేరళీయులు బుద్ది చెప్పను న్నారు. ఎఐడీఎంకేతో కలిసి తమిళనాడులో అధికార పగాలను చేపట్టడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలనూ తమిళ ప్రజలు అడ్డుకున్నారు. ఇక్కడ డీఎంకే, వామపక్షాల కూటమి ఘన విజయం సాధించనుంది. సరిహద్దుల్లో కీలక రాష్ట్రమైన పశ్చిమబెంగాల్లోనూ మోడీ- షాలకు భంగపాటే ఎదరుకానుంది. ఈ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్సే మరోసారి అధికారంలోకి రానుందని మెజార్టీ సర్వేలు తెలిపాయి. ఇప్పటికే అధికారంలో కొనసాగుతున్న అసోంలోనూ, ఎన్నికల ముందు వరకు రాజీనామా డ్రామాలు సాగిన పుదుచ్చేరిలోనూ బీజేపీకి మొగ్గు కనపడుతుది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలోని అనైక్యత, ఎత్తుగడల తప్పులు బీజేపీకి కలిసి రానున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో టీఆర్ఎస్, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఉన్నికల్లో వైసీపీ గెలవనున్నట్టు ఆత్మసాక్షి, ఆరా సంస్థలు వెల్లడించాయి.
పశ్చిమబెంగాల్ ..
సర్వే సంస్థ టీఎంసీ బీజేపీ లెఫ్ట్+కాంగ్రెస్
ఎబిపి-సిఓటర్ 152-164 109-121 14-25
టైమ్స్‌నౌ 158 115 19
ఈటీజా రీసెర్చి 164-176 105-115 10-15
ఇండియాటుడే 64-88 172-193 7-12
తమిళనాడు..
సర్వే సంస్థ డీఎంకె+ ఎఐడీఎంకే+
రిపబ్లిక్ సిఎన్ఎక్స్ 160-180 58-68
టుడేస్ చాణక్య 164-186 46-68
యాక్సిస్ ఇండియా 175-195 38-54
పి-మార్క్ 165-190 40-65
కేరళలో..
ఎబీపీ న్యూస్-సీఓటర్ 71-77 62-68 0-2 0
ఇండియా న్యూస్-జన్‌కి బాత్ 64-77 61-71 2-4 0
ఇండియా టుడే-యాక్సిస్ మైఇండియా 104-120 20-36 0-2 0-2
న్యూస్ 24-టుడేస్ చాణక్య 102 35 3 0
పి-మార్క్యూ 72-79 60-66 0-3 0-1
రిపబ్లిక్ టీవీ-సిఎన్ఎక్స్ 72-80 58-64 1-5 0
పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ 85 53 2 0