Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా మూడో రోజు దాటిన మూడు వేలు మరణాలు
- ప్రపంచంలో ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి ఇండియాదే
- కరోనాతో జహంగీర్ సోరాబ్జీ మృతి
- కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలైన బీజేపీ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయానికి యావత్ భారతావని వణికిపోతున్నది. నిత్యం వేల మందిని బలితీసుకుంటున్నది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలు వైరస్ ఉధృతిని కండ్లకు కడుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 19,20,107 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 3,86,452 లక్షల మంది కరోనా బారినపడగా, దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,87,62,976కి చేరింది. వరుసగా మూడో రోజూ 3 వేల మందికి పైనే మృతిచెందారు.
కరోనాతో సోరాబ్జీ మృతి
భారత మాజీ అటార్నీ జనరల్ (ఏజీ), ప్రముఖ న్యాయకోవిదుడు సోలి సొరాబ్జీ (91) కరోనాతో కన్నుమూశారు. దేశంలోని సీనియర్, ప్రముఖ న్యాయవాదులలో ఆయన ఒకరు. 2002లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. కాగా, ఇటీవల సొరాబ్జీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, పరిస్థితి విషమించి శుక్రవారం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోలి సోరాబ్జీ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కరోనా ఎక్కడుందన్నాడు..
దానికే బలైన బీజేపీ ఎమ్మెల్యే
లక్నో : కరోనా ఎక్కడుంది..? మాస్కులు కట్టుకోవడం అవసరమా..? కరోనా ఎప్పుడో తోక ముడిచింది.. అంటూ వెక్కిరింత మాటలు మాట్లాడిన ఓ ఎమ్మెల్యే.. అదే వైరస్ గురై ప్రాణాలు వదిలారు. అదికూడా ఓ ఎమ్మెల్యే అయి ఉండి కూడా 24 గంటల పాటు ఐసీయూ దొరకని పరిస్థితిలో సరైన వైద్యం అందక చనిపోయారు. ఈయన చనిపోయిన 2 రోజుల తర్వాత ఆయన దయనీయస్థితి సోషల్ మీడియాతో వెలుగులోకి వచ్చంది.