Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరపరాజయం
బెంగళూరు: కర్నాటక పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ ఘోర పరాజయం పాలైంది. మొత్తంగా ఎన్నికలు జరిగిన పది అర్బన్ లోక్ల్ బాడీ (యూఎల్బీ)లకు గానూ ఏడింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జేడీ(ఎస్) రెండు సాధించగా, బీజేపీ ఒక్కదానితోనే సరిపెట్టుకుంది. మొత్తంగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 119, జెడి(ఎస్) 67 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 56 స్థానాలకే పరిమితమైంది. గత మంగళవారం యూఎల్బీలకు ఎన్నికలు జరిగాయి. శనివారం ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డి.కె.శివకుమార్ మాట్లాడుతూ తప్పుడు పాలన సాగించిన బీజేపీని ప్రజలు పక్కకు నెట్టారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఈ రెఫరెండంలో ఓడిపోయిందని అన్నారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలు ఆడిందనీ, అందుకే బీజేపీకి గుణపాఠం చెప్పారన్నారు. తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి యడియూరప్పని డిమాండ్ చేశారు.