Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా కట్టడి నియంత్రణా చర్యల్లో భాగంగా.. వివిధ దశల్లో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా.. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. ఈరోజు (మే 1) దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రయివేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మాక్స్ హెల్త్‌కేర్ ఆసుపత్రి వర్గాలు ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నాయి. అలాగే పూసారోడ్, పట్పర్గంజ్, షాలిమార్ బాగ్ కేంద్రాల్లో కూడా టీకాలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే అధికారులు మాత్రం.. వ్యాక్సిన్ పొందడానికి ఖచ్చితంగా.. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రజలకు చెబుతున్నారు. ఇక అపోలో ఆసుపత్రి వర్గాలు సోమవారం నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపాయి. కాగా, శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాక్సినేషన్ అందుబాటులో లేదని.. దయచేసి ఎవరూ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారలు తీరొద్దని సూచించిన విషయం తెలిసిందే. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ ధర రూ. 1,250, సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ తయారుచేసిన కోవీషీల్డ్ టీకా రూ.800లకు అందివ్వనుంది.