Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఒక్కరోజులో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో రోజువారీ కేసులు నమోదడం గమనార్హం. గత 24 గంటల్లో 19,45,299 మందికి పరీక్షలు నిర్వహించగా, 4,01,993 మందికి పాజిటివ్ వచ్చింది. 3,523 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969కు, మరణాల సంఖ్య 2,11,853కు చేరింది. మరణాల రేటు 1.11శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,99,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు.కాగా తీహార్ జైలులో హత్యానేరం కింద జీవిత ఖైదు అనుభవిస్తూ, ఢిల్లీ దీన్‌దయాళ్ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) మాజీ ఎంపి మొహమ్మద్ షహబుద్దీన్ (53) శనివారం మరణించారు.
ఢిల్లీలో మరోవారం లాక్ డౌన్ పొడిగింపు
రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతుండటంతో ఢిల్లీలో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగించారు. ఏప్రిల్ 19న విధించిన లాక్డౌన్ సోమవారం ఉదయంతో ముగియాల్సి ఉండగా, తాజా ఆదేశాలను అక్కడి ప్రభుత్వం జారీ చేసింది.