Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొట్టిపారేసే తరహాలోని మోడీ సర్కార్
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత కరోనా కల్లోలాన్ని, రోజువారీ కేసుల సంఖ్యను కేంద్రం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ ముందే అంచనా వేసిందా? సకాలంలో నివారణ చర్యలు తీసుకోకుంటే విలయాన్ని ఆపగలిగేవారమా? అవుననే అంటు న్నారు నిపుణులు. జాగ్రత్తలు తీసుకోకపోతే... వైరస్ రెండో దశలో ప్రళయం తప్పదని మార్చి 9నే కేంద్రమే ఏర్పాటుచేసిన ప్రత్యేక నిపుణుల కమిటీ హెచ్చరించింది. మే నెల ప్రారంభానికి రోజువారీ కేసులు 3.8 లక్షల నుంచి 4.4 లక్షలకు చేరుకుంటాయని ఆనాడే చెప్పింది. మే మధ్యకాలానికి క్రియాశీల కేసుల సంఖ్య 33-35 లక్షలకు చేరుతాయని అంచనా వేసింది. అయితే కేంద్రం ఈ విషయాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదని స్పష్టమవుతున్నది. రెండో దశ వ్యాప్తిని కొట్టిపారేసే తరహాలోనే వ్యవహరించింది.
నిపుణుల కమిటీ..
కరోనా నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఏడుగురు నిపుణులతో నేషనల్ కొవిడ్-19 సూపర్ మోడల్ కమిటీని నియమించింది. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ఖరగ్‌పుర్ ప్రొఫెసర్ ఎం.అగర్వాల్, వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వైరాలజీ ప్రొఫెసర్ గగన్‌దీప్ కాంగ్ తదితరులున్నారు. ఈ కమిటీ ఇప్పటికే మనుగడలో ఉంది. రెండో దశ వ్యాప్తిపై మార్చి 9న ఈ కమిటీ కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. అప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కేరళలో రెండో దశ ప్రారంభమైందనీ, తక్షణమే నివారణ చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్తం అవుతుందని హెచ్చరించింది.''దేశంలో ఎన్నికల ప్రచారానికి ముందే.. కొవిడ్ కేసులు పెరగడం మొదలైంది. మార్చి 11న కుం భమేళా మొద లయ్యేసరికే రెండో దశ వ్యాప్తి దేశాన్ని చుట్టుమ ుట్టింది. ప్రజలు నిబంధనల్ని పెడచెవిన పెట్టడం ఎక్కువైంది. నిర్లక్ష్యంగా, గుంపులుగా తిరగడం, పెళ్లి ళ్లు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరగడం, ముఖ్య ంగా కుంభమేళా వైరస్ వ్యాప్తికి కారణమైంది'' నిపుణుల కమిటీ సభ్యులొకరు వివరించారు.