Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పందన తెలపాలంటూ కేంద్రానికి నోటీసు
- ఐపీసీలోని సెక్షన్-124ఏ చెల్లుబాటుపై సుప్రీంను ఆశ్రయించిన ఇద్దరు జర్నలిస్టులు
న్యూఢిల్లీ: ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) 124-ఏ (రాజద్రోహం చట్టం) రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సమీక్ష చేయడానికి సిద్ధమైంది. మణిపూర్‌కు చెందిన కిషోరచంద్ర, చత్తీస్‌గఢ్‌కు చెందిన కన్హయ్యలాల్ శుక్లా..అనే ఇద్దరు జర్నలిస్టులు రాజద్రోహం చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఇందిరా బెనెర్జీ, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా కేంద్రానికి నోటీసులు జారీచేసింది. పిటిషన్‌దారులు సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తాము విమర్శనాత్మక కార్టూన్లు, కామెంట్లు చేశామని, వీటిని సామాజిక మాధ్యమంలోనూ పంచుకున్నామని, దాంతో పాలకులు తమపై కక్షపూరితంగా దేశద్రోహం చట్టం (ఐపీసీ 124ఏ) కింద కేసులు నమోదుచేశారని పిటిషన్‌దారులు తెలిపారు. ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఈ దేశంలోని ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులున్నాయి. దీని ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం..అన్నవి ప్రతి పౌరుడికి దఖలుపడ్డాయని పిటిషన్‌దారులు తెలిపారు. ఈమేరకు ప్రభుత్వాన్ని, పాలకుల్ని విమర్శించే హక్కు, విధానాలపై ప్రశ్నించే హక్కు తమకు ఉందని, అయితే తమ ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తూ తమపై ఐపీసీ 124ఏను ప్రయోగించారని సుప్రీంకు తెలిపారు. ఈనేపథ్యంలో రాజద్రోహం చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై స్పష్టత ఇవ్వాలని పిటిషన్‌దారులు కోరారు. 1962నుంచి ఈ చట్టం దుర్వినియోగమవుతోందని న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు.
'' నేటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా రాజద్రోహ చట్టాన్ని అమలుచేయటం లేదు. 1962లో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుగుబాటు, హింసాత్మ ఘటనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం..వంటివి నిరోధించడానికి కేసులు నమోదుచేయాలని స్పష్టం చేసింది. అయితే 2021లో మాపై మోపిన ఆరోపణల్లో అలాంటి పరిస్థితి లేదు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు'' అని పిటిషన్‌దారులు సుప్రీంకు తెలిపారు.