Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఎల్ఎంఓ సర్ప్లస్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కేరళ
- రాష్ట్ర అవసరాలు 100 టన్నులుకాగా..250 ఉత్పత్తి
- గోవా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఆపన్నసాయం
- కరోనా విపత్తుపై ముందుచూపుతో ఏడాది క్రితం నుంచే ఏర్పాట్లు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌లో అనేకమంది వైరస్ బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి కారణం సమయానికి 'మెడికల్ ఆక్సిజన్' వారికి ఎక్కించకపోవటమే. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర..తదితర రాష్ట్రాల్లోని హాస్పిటల్స్‌లో చేరుతున్న కరోనా రోగులకు మెడికల్ ఆక్సీజన్ లభ్యం కావటం లేదు. దాంతో పరిస్థితి చేయిదాటిపోయి, రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోగులకు ఆక్సిజన్్ లేదనే మాట దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం కేరళలో వినబడటం లేదు. దానికి కారణం ఆ రాష్ట్రంలోని పాలకుల ముందు చూపు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల ఫలితం. ఇప్పుడు దేశంలో ఆక్సిజన్ నిల్వలు మెండుగా ఉన్న రాష్ట్రంగా, ఇతర రాష్ట్రాలకు సైతం ఆక్సిజన్‌ను సరఫరా చేయగలిగే స్థితిలో కేరళ ఉందని అక్కడి గణాంకాలు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తలెత్తితే ఆక్సీజన్ పెద్ద మొత్తంలో అవసరమవుతుందని పినరరు విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ముందుగానే అంచనావేసింది.
రోజుకు 250 టన్నుల ఆక్సీజన్ తయారీ
కొద్ది వారాల క్రితం గోవాలో మెడికల్ ఆక్సీజన్ తీవ్ర కొరత ఉందని తెలిసి, ఆ రాష్ట్ర విన్నపంమేరకు కేరళ ప్రభుత్వం అక్కడికి 20వేల లీటర్ల ఆక్సీజన్ పంపింది. దీనిపై గోవా ఆరోగ్యమంత్రి విశ్వజీత్ రాణే ట్విట్టర్లో కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అలాగే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు కూడా ఆక్సీజన్ పెద్ద మొత్తంలో కేరళ నుంచి పంపణీ అయ్యింది. కరోనా, నాన్ కరోనా కేసుల వల్ల కేరళలో మెడికల్ ఆక్సీజన్ డిమాండ్ రోజుకి సుమరుగా 100 టన్నులు. ఈనేపథ్యంలో ఆక్సీజన్ ఉత్పత్తి, సరఫరా, నిల్వలపై ఒక ముందస్తు ప్రణాళికను కేరళ తయారుచేసుకుంది. ప్రణాళిక అమలు, పర్యవేక్షణ కోసం నోడల్ అధికారుల్ని సైతం నియమించారు. ఫలితం నేడు అక్కడ ప్రతి రోజు 250 టన్నుల మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తి అవుతోంది.
కోవిడ్ పేషంట్ల మూలంగా ఏర్పడుతున్న డిమాండ్ 51.45 టన్నులు. నాన్-కోవిడ్ చికిత్సలకు 47.16 టన్నుల ఆక్సీజన్ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ మెడికల్ ఆక్సీజన్ అవసరాలు 98.61 టన్నులు. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలో నెలకొన్న డిమాండ్ 100 టన్నులు.
గత ఏడాది మార్చి నుంచే ఏర్పాట్లు
సర్ప్లస్ ఆక్సీజన్ నిల్వలను సాధించిన రాష్ట్రంగా కేరళ నిలబడటం వెనుక అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఎన్నో నెలలపాటు చేసిన కృషి ఉంది. అక్కడి వార్తా కథనాల ప్రకారం, ఈ సక్సెస్‌కు కారణం రెండు సంస్థలని తెలుస్తోంది. ఒకటి..పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ), రెండోది..కేరళ ఆరోగ్య శాఖ. హాస్పిటల్స్‌కు ఎంతమంది పేషంట్లు రావొచ్చు, వారికి ఎంతమేరకు మెడికల్ ఆక్సీజన్ అవసరమవుతుంది? అన్నవి గత ఏడాది మార్చిలోనే కేరళ ఒక ప్రణాళిక రూపొందించుకుంది. ఆమేరకు ఆక్సీజన్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేసుకుంది.
రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర సంస్థల నుంచి ప్రతి రోజూ 204.75 టన్నుల మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తిని సాధించారు. అలాగే తిరువనంతపురం, కొల్లాం, కొట్టయాం, త్రిస్సూర్, ఎర్నాకులం జిల్లాల్లో 11 చోట్ల ఎయిర్ సెపరేషన్ యూనిట్లును ఏర్పాటుచేశారు. వీటి నుంచి ప్రతి రోజూ మరో 44 టన్నుల మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తి అవుతోంది. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు 250 టన్నుల ఆక్సీజన్ తయారవుతోంది.
'ఆరోగ్య వ్యవస్థను జాతీయం చేసేవాళ్ళం'
కరోనా మహమ్మారిని కట్టడిచేయటంలో కేరళ పనితీరు ఆదర్శంగా నిలిచిందంటూ ప్రపంచవ్యాప్తంగా ఆ రాష్ట్రానికి ప్రశంసల జల్లు కురిసింది. ఆ ప్రయత్నానికి నాయకత్వం వహించింది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న ఆమె ఇటీవల ఓ జాతీయ చానెల్‌తో ముచ్చ టించారు. కేంద్రంలో తాము అధికారంలో ఉంటే.. దేశంలోని ఆరోగ్య, విద్యావ్యవస్థలను జాతీయం చేసే ఉండేవాళ్ళమని అన్నారు. ప్రస్తు తం బడ్జెటనలో ఆరోగ్యం కోసం ఒక శాతం మాత్ర మే ఖర్చు చేస్తున్నారని.. అది ఏ మాత్రం సరిపో దన్నారు. కనీసం పదిశాతం ఖర్చుపెట్టాలని అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ సరఫరా అంశంపై మాట్లాడుతూ.. ప్రాణవాయువు సంక్షోభంపై గతేడాదే తాము అంచనావేశామన్నారు. పరిశ్రమల శాఖతో సమావేశం జరిపి పాలగాడ్ జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయి ంచామని.. దానిని తక్షణమే అమలులోకి తెచ్చి నట్టు చెప్పారు. ఈ ఆపద సమయంలో అది పెద్ద దిక్కుగా పనిచేస్తున్నదని తెలిపారు. తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చేనాటికి 37శాతం మంది ప్రభుత్వాస్పత్రులను వినియోగించుకునేవారనీ, అది ఇప్పుడు 50శాతానికి పెరిగిందని చెప్పారు.