Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురికి తీవ్ర గాయాలు
థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఒక ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ లీకేజీ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఓ మెకానిక్ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. థానేలోని బద్లాపూర్ టౌన్‌షిప్‌లోని ఓ భవనం ఏడవ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని థానే మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ సంతోష్ కదమ్ అన్నారు. ఎల్పీజీ సిలిండర్ నాజిల్ నుంచి గ్యాస్ లీకేజీని కుటుంబ సభ్యులు గమనించి, దాన్ని బాగుచేయడానికి మెకానిక్‌ను పిలిచారు. ఈ క్రమంలోనే గ్యాస్ లీకేజీ వల్ల ఇంట్లో పెలుడు సంభవించి, తీవ్రంగా మంటలు చెలరేగాయన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, మెకానిక్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.