Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ ఏపీ మంత్రి
అమరావతి: ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిం దిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకు న్నట్లు పేర్కొన్నారు. ధర్మాసనం అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తోందని తెలిపారు. .10వ తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు లేక పోవడం, జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించారని, మరి కొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్ సర్టిఫికెట్ ఇస్తున్నారన్నారు. పరీక్షలు రద్దు కాకుండా ఉన్న రాష్ట్రాల్లో బాగా చదివిన విద్యార్థులకు మంచి మార్కులతో, గ్రేడ్లతో సర్టిఫికెట్లు వస్తాయని తెలిపారు. మార్కులూ ర్యాంకులూ ఉన్న విద్యార్థు లకు మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయని వివరిం చారు. ఇంటర్ తరవాత పెద్ద చదువుల కోసం రాసే పోటీ పరీక్షకు కూడా ఇంటర్లోనుంచి కనీసం కొంత శాతం మార్కులు వచ్చి తీరాలన్న నిబంధనలు కూడా ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల కెరీర్ అవకాశాల పరంగా చూసినా, వారి భవిష్యత్ ఉద్యోగాల కోసం ఇలా ఇంటర్ మార్కుల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రతి సందర్భంలోనూ పరీక్ష రాసి మంచి మార్కులతో, ర్యాంకులతో సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికే మెరు గైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల భవిష్యత్ ధృష్ట్యా పూర్తిగా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఆరోగ్యపరమైన అన్ని నిబంధనలూ అమలు చేస్తూ... ప్రత్యేక బందాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించామన్నారు.