Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు లోక్సభ, 11 శాసన సభ స్థానాలకు ఎన్నికలు
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశంలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడ్డట్టుగానే ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ వెనుకబడింది. నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క స్థానంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. మిలిగిన మూడు స్థానాల్లో బీజేపీ ఓటమి చెందింది. కర్నాటకలోని బెల్గాం నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ గెలిపొందింది, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో వైసీపీ, కేరళలోని మలప్పురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఐయుఎంఎల్ గెలిపొందాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ఒక్కొ స్థానానికి ఎన్నికలు జరగ్గా బీజేపీ గెలిచింది. కర్నాటకలో రెండు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరొక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. రాజస్థాన్లో మూడు స్థానాలకు రెండు కాంగ్రెస్, ఒకటి బీజేపీ కైవశం చేసుకున్నాయి. మధ్యప్రదేశ్లో ఒక స్థానానికి ఎన్నిక జరిగితే, దాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. తెలంగాణలో ఒకస్థానానికి ఎన్నిక జరగగా, అధికార టీఆర్ఎస్ సొంత చేసుకుంది. మిజోరాంలో జరిగిన ఒక స్థానంలో జోరం పిపుల్స్ మూమోంట్ గెలిచింది.