Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకు వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: 18ఏండ్ల నుంచి 45 ఏండ్ల మధ్య వయసులో వున్న 59 కోట్ల మందికి టీకాలు వేయడానికి మొత్తంగా 122 కోట్ల డోసులు కావాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈమేరకు కోర్టుకు అఫిడవిట్ అందజేసింది. ప్రజలకు టీకా వేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపింది. అందుబాటులో వున్న వనరులు, డోసులను పరిగణనలోకి తీసుకుని సాధ్యమైనంత త్వరలో వంద శాతమూ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు పరిమితంగానే అందుబాటులో వున్నందున అత్యంత శాస్త్రీయ పద్ధతిలో టీకాలు వేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం అనివార్యమైందని పేర్కొంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ కాకుండా ఇతర వ్యాక్సిన్లను కూడా సేకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని అఫిడవిట్ పేర్కొంది. ఇతర దేశాల్లో ఆమోదం పొందిన విదేశీ తయారీ వ్యాక్సిన్లకు అత్యవసర ఆమోదాలు తీసుకున్నామని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ను వినియోగించేందుకు ఇప్పటికే లైసెన్స్ మంజూరు చేశామని కేంద్రం కోర్టుకు వివరించింది. స్థానికంగా తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ జులై నుండి లభిస్తుందని అంచనా వేసినట్లు తెలిపింది. జులై, ఆగస్టుల నాటికి వరుసగా 80 లక్షలు, కోటీ 60లక్షల డోసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. గతేడాది మధ్య నుండే ఫైజర్, మోడర్నా, జెఅండ్జె తయారీదారులతో మాట్లాడుతున్నామని, భారత్లోని స్థానిక భాగస్వాముల ద్వారా వీటిని వృద్ధిపరచడానికి, సరఫరా చేయడానికి, తయారు చేయడానికి చర్చలు జరుగుతున్నాయని అఫిడవిట్ తెలిపింది.