Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీఐ చెరు రెండు స్థానాల్లో గెలుపు
చెన్నై : తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో వామపక్షాలు ప్రతిభను కనబరిచాయి. సీపీఐ(ఎం), సీపీఐ చెరో రెండు స్థానాల్లో ఘన విజయం సాధించాయి. గండ్రవక్కొట్టై నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం.చిన్నతురై 13,592 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. కిలావేలూరు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి వి.పి నాగైమలి 17,234 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. సీపీఐ(ఎం)కు ఓటేసినందుకు ఆ రాష్ట్ర కమిటీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే తిరుతురైపూండి నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి మారిముత్తు 30,326 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. తాలి నియోజవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి టి.రామచంద్రన్ 12,231 మెజార్టీతో గెలిపొందారు.