Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభమా, ఆర్థికమాంద్యమా కారణాలేమైనా.. భారత్ వాణిజ్య లోటు భారీగా పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చుకుంటే, ఈ ఏడాది ఏప్రిల్‌లో వాణిజ్యలోటు 15.24 బిలియన్ డాలర్లు(రూ.1.12లక్షల కోట్లు)కు చేరుకుందని కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారంలో పేర్కొన్నారు. ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడానే వాణిజ్యలోటుగా పేర్కొంటారు. ఏ దేశానికికైనా ఎగుమతులు ఎక్కువగా ఉండి, దిగుమతులు తక్కువగా ఉంటే..విదేశీ మారక నిల్వలు మెరుగ్గా ఉంటాయి.
ఏప్రిల్ 2020లో వాణిజ్యలోటు 6.92 బిలియన్ డాలర్లు (రూ.51 వేల కోట్లు) కాగా, అదిప్పుడు 120.34శాతం పెరిగింది. అయితే ఊరట కలిగించే విషయం ఏమంటే..గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో ఎగుమతులు, దిగుమతులు మెరుగుపడ్డాయి. గత ఏడాది ఏప్రిల్‌లో భారత్ ఎగుమతులు కేవలం 10.17 బిలియన్ డాలర్ల (రూ.80వేల కోట్లు)కు పరిమితంకాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ ఎగుమతులు 30.21 బిలియన్ డాలర్లు (రూ.2.2లక్షల కోట్లు)కు పెరిగాయి. గత ఏడాది మార్చి 25న కేంద్రం ఏకపక్షంగా లాక్డౌన్ విధించటం భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. 60.28శాతం ఎగుమతులు ఒక్కసారిగా పడిపో యాయి. మళ్లీ ఏడాదికాలం తర్వాత ఎగుమతులు ఈ ఏడాది మార్చిలో 34.45 బిలియన్ డాలర్ల (రూ.2.25 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఇక ఏడాది ఏప్రిల్‌లో 10.8 బిలియన్ డాలర్ల (రూ.80వేలకోట్లు) చమురు దిగుమతి అయ్యింది. విలువైన రాళ్లు, బంగారు ఆభరణాలు, జ్యూట్, కార్పెట్లు, హస్తకళాకృతులు, లెదర్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వస్తువులు, ఇంజనీరింగ్, పెట్రోలియం, మెరైన్ ఉత్పత్తులు, రసాయనాలు భారత్ నుంచి పెద్దమొత్తంలో ఎగుమతయ్యాయి.