Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో తొలిసారి అత్యధికం..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో కొత్త కేసులు, మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం దాదాపు 4 లక్షల కొత్త కేసులు, మూడువేలకు పైగా మరణాలు నమోదుకావడం వైరస్ విజృంభణకు అద్దం పడుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 3,92,488 మంది కరోనా సోకింది. ఇదే సమయంలో 3,689 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్త కరోనా మరణాలు 2,15,542కు పెరిగాయి. పాజిటివ్ కేసులు 1,95,57,457కు చేరాయి.
కాగా, దేశంలో నమోదైన కొత్త కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర (63,282), కర్నాటక (40,990), కేరళ (35,636), ఉత్తర ప్రదేశ్ (30,180), ఢిల్లీ (25,219) రాష్ట్రాల్లో నమోదయ్యాయి. మరణాల్లో అధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలలో నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 29,01,42,339 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 18,04,954 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. అలాగే, మొత్తం 15,68,16,031 మంది టీకాలు అందించారు. కాగా ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్,వ్యాక్సిన్లు, వెంటిలేటర్ల కొరత ఉన్నా కేంద్రం నుంచి ఆశించిన రీతిలో స్పందించటంలేదని కరోనాబాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.