Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద ప్రమాదం సంభవించవచ్చు : ఆక్సిజన్ కోసం ఢిల్లీలో రెండు ఆస్పత్రులు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వేధిస్తూనే ఉంది. తాజాగా ఆదివారం రెండు ఆసుపత్రులు ఆక్సిజన్ కోసం అధికారులకు ఎస్ఓఎస్ కాల్స్ ద్వారా విజ్ఞప్తి చేశాయి. 'ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. పెద్ద ప్రమాదం సంభవించవచ్చు' అని పేర్కొన్నాయి. మవియాలోని మధుకర్ రెయిన్బో చిన్నారుల ఆస్పత్రి ఆదివారం మధ్యహ్నాం ఆక్సిజన్ కోసం విజ్ఞప్తి చేసింది. క్షీణిస్తున్న ఆక్సిజన్ నిల్వలతో నలుగురు నవజాత శిశువులతో సహా 50 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయిని తెలిపింది. ఈ ఆస్పత్రిలో కోవిడ్ రోగులతో సహా మొత్తం 80 మంది రోగులు ఉండగా, వీరిలో 15 మంది నవజాత శిశువులు ఉన్నారు. కాగా, తమ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ నిల్వలు లేవని, కేవలం ఒక ప్రైవేటు వ్యాపారి అందిస్తున్న ఆక్సిజన్ సిలెండర్లుపైనే ఆధారపడుతున్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. 'నిరంతర సరఫరా లేక ప్రతి రోజూ ఇబ్బందులు పడుతున్నాం. మాకు కనీసం రోజుకు 125 ఆక్సిజన్ సిలండర్లు అవసరం' అని ఆస్పత్రి అధికారులు తెలిపారు. అధికారుల నుంచి సహయం కొరుతూ ట్విట్టర్ ద్వారాను ఆస్పత్రి విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందించిన ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చధ '5 డి టైప్ ఆక్సిజన్ సిలెండర్లును ఆస్పత్రికి ఏర్పాటు చేశాం. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా తగ్గించడం వలన ప్రభుత్వం వద్ద ఆక్సిజన్ నిల్వలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా మేం అన్ని చర్యలు తీసుకుంటున్నాం' అని ట్వీట్ చేశారు. అలాగే, కల్కజిలోని ట్రిటన్ ఆస్పత్రి కూడా ఆక్సిజన్ కొరత గురించి విజ్ఞప్తి చేసింది. 'మేము ఒక వారం నుంచి ఆక్సిజన్ కోసం అన్వేషిస్తున్నాం. నిరంతర సరఫరా త్వరలో నిర్ధారించబడకపోతే పెద్ద విషాదం సంభవించవచ్చు' అని ఆస్పత్రి వైద్యులు శ్రీమతి డాక్టర్ దీపాలి గుప్తా తెలిపారు. ఈ ఆసుపత్రి కూడా 5 డి టైప్ ఆక్సిజన్ సిలెండర్లును ఆసుపత్రికి ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే చధ తెలిపారు.