Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షకూటమి నయారికార్డ్
- 40 ఏండ్ల సాంప్రదాయానికి తెరదింపిన వైనం
- వరుసగా రెండోసారి అధికారంలోకి
తిరువనంతపురం: కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి చరిత్ర తిరగరాసింది. ఐదేండ్లకోసారి అధికార మార్పిడి జరిగే కేరళలో ఆ సాంప్రదా యానికి అధికార ఎల్డీఎఫ్ కూటమి ఫుల్స్టాప్ పెట్టింది. వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టనున్నది. దీంతో 40 ఏండ్ల 'అధికార మార్పిడి' సాంప్రదాయానికి ఎల్డీఎఫ్ కూటమి తెర దింపింది.
కేరళతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ముఖ్యంగా, కేరళలో అధికార వామపక్ష కూటమి తన సత్తా చాటింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళ అసెంబ్లీలో 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎల్డీఎఫ్.. ప్రతిపక్ష యునైటెడ్ ఫ్రంట్ (యూడీఎఫ్)ను మట్టికరిపించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 41 సీట్లకే పరిమితమైంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన బీజేపీ మాత్రం మూడు స్థానాల్లో మాత్రమే తన ఆధిక్యతను ప్రదర్శించింది. చివరికి ఒక్కసీటూ దక్కించుకోలేకపోయింది.
విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారు 2016లో కేరళలో అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో మొత్తం 91 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నది. అయితే, ప్రజా బలాన్ని పొందిన ఎల్డీఎఫ్.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అధికారానికి కావాల్సిన సీట్లను గెలుచుకోవడంలో ముందంజలో ఉన్నది. ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ఎగ్జిట్‌పోల్ ఫలితాలు సైతం ఇవే ఫలితాలను వెలువర్చాయి. 2016 ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటుతో మాత్రమే సరి పెట్టుకున్నది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాలు గెలుపొందాలని భావించింది. 'మెట్రోమ్యాన్' శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా నిలబెట్ట ఎన్నికల్లో లబ్ది పొందాలని కాషాయ పార్టీ భావించింది. ఇందుకు తన మార్కు రాజకీయమైన 'మతానికి' సైతం పదును పెట్టింది. కానీ కేరళ ప్రజలు మాత్రం బీజేపీ మాటలను ఏ మాత్రమూ నమ్మలేదు. ప్రధాని మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో పాటు బీజేపీ అగ్రనాయకుల ప్రచారాలు సైతం కేరళ ప్రజలపై ఏ మాత్రమూ ప్రభావాన్ని చూపలేకపోయాయి. దీంతో ఈ ఎన్నికల్లోనూ బీజేపీ చతికిలపడింది.