Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం భారీ స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,68,147 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో కరోనాతో పోరాడుతూ 3,417 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1,99,25,604కు చేరాయి. మరణాలు 2,18,959కి పెరిగాయి. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 1,62,93,003 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 34,13,642 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 29,16,47,037 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 15,04,698 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. అలాగే, దేశంలో మొత్తం 15,71,98,207 మందికి కరోనా టీకాలు అందించారు.
కాగా, దేశంలో నమోదైన కొత్త కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర (56,647), కర్నాటక (37,773), కేరళ (31,959) రాష్ట్రాల్లో నమోదయ్యాయి. మరణాల్లో సైతం మహారాష్ట్రలోనే అధికంగా సంభవిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 669, ఉత్తరప్రదేశ్లో 288, కర్నాటకలో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.
పంజాబ్లో లాక్డౌన్ తరహా ఆంక్షలు
కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ తరహా ఆంక్షలను పొడిగిస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆంక్షలు మే 15 వరకు అమలులో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పంజాబ్లో కొత్తగా 7,327 కేసులు, 157 మరణాలు నమోదయ్యాయి.
కరోనాతో బీజేపీ నేత మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత చికిత్స నిమిత్తం కాన్పూర్లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయారు.
నీట్ పీజీ పరీక్షను 4 నెలల పాటు వాయిదా వేయండి
నీట్-పీజీ పరీక్షను కనీసం 4 నెలల పాటు వాయిదా వేయాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సూచించింది. అలాగే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులను కోవిడ్-19 సేవలకు వినియోగించుకోవాలనీ, సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులను పూర్తి సమయం నర్సింగ్ విధుల్లోకి తీసుకోవడానికి నిర్ణయించారు. అలాగే, కోవిడ్ డ్యూటీ 100 రోజులు పూర్తి చేసుకున్న వైద్య ఉద్యోగులకు రాబోయే ప్రభుత్వ ఉద్యోగ నియామకంలో ప్రాధాన్యతను ఇవ్వనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.