Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం: అనకాపల్లి మాజీ ఎంపి, టిడిపి నాయకుడు సబ్బం హరి (69) కరోనాతో సోమవారం మరణించారు. ఏప్రిల్ 15న కరోనా పాజిటివ్ వచ్చిన ఆయన నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని వైద్యులు తెలిపారు. విశాఖ జిల్లా చిట్టివలసలలో 1952 జూన్ ఒకటిన హరి జన్మించారు. కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర కార్యదర్శిగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో విశాఖ మేయర్గా ఎన్నికయ్యారు. 2009లో అనకాపల్లి ఎంపిగా గెలుపొందారు. 2019లో టిడిపిలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. హరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.