Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు, మాజీ న్యాయమూర్తి ప్రఫుల్ల చంద్ర పంత్‌ను ఆ సంఘం తాత్కాలిక (యాక్టింగ్) ఛైర్‌పర్సన్‌గా నియమించినట్లు ఎన్హెచ్ఆర్సి సోమవారం వెల్లడించింది. ఈ నియామకం ఏప్రిల్ 25 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ప్రఫుల్ల 2019, ఏప్రిల్ 22 నుంచి ఎన్‌హెచ్‌ఆర్‌సిలో సభ్యుడిగా ఉన్నారు. ఎన్హెచ్ఆర్సి ఛైర్పర్సన్ పదవి గతేడాది డిసెంబర్ 2 నుంచి ఖాళీగా ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ హెచ్ఎల్.దత్తు అప్పటి వరకు ఈ పదవిలో ఉన్నారు.