Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరో పది మంది మృతి
విజయవాడ: ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ రోగుల మరణాలు రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని కోవిడ్ ఆస్పత్రిలో ఎనిమిది మంది, కర్నూలు నగరంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో ఇద్దరు కరోనా రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా మరణించారని వారి బంధువులు ఆరోపించారు. ఈ మరణాలకు ఆక్సిజన్ కొరత కారణం కాదని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే మృతి చెందారని వైద్యులు, అధికారులు చెబుతున్నారు. . హిందూ పురం పట్టణంలోని జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారు జామున కొన్ని గంటల వ్యవధిలోనే ఎనిమిది మంది మరణించారు. అయితే, సుమారు ఐదు గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని చెబుతూ మృతుల బంధువులు ఆందోళనకు దిగారు ఈ ఆస్పత్రిలో సంభవించిన మరణాలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్, ప్రజాసంఘాలు, అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. కర్నూలులోని అమీలియా కోవిడ్ ఆస్పత్రిలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న ఇద్దరు రోగుల మృతికి కూడా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడమే కారణమనిమతుల బంధువులు ఆరోపించారు.
మరణించారు.. చంపేశారా : రాహుల్
ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు చేసిన ట్వీట్లో ' వారు మరణించారా.. చంపేశారా?.... ఇంక ఎంత మంది బాధలు పడితే ఈ వ్యవస్థ మేలుకుంటుంది?' అని ప్రశ్నించారు.