Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవ వైవిధ్యం కాపాడుకుంటేనే వైరస్లను ఎదుర్కోగలం : ఐరాస నివేదిక
- 160కోట్లమంది అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు..
- కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఉపాధి, ఆరోగ్యం
- ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,ఆరోగ్య సేవలు లేక విలవిల
న్యూఢిల్లీ: కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం నేడు కొట్లాడుతోంది. కోవిడ్-19 వైరస్ కేవలం ప్రజా ఆరోగ్య వ్యవస్థనే కాదు, అన్నిరంగాలనూ కుదేలు చేసింది. మానవాళికి ఒక సంక్లిష్టమైన సవాల్ విసిరింది. కొన్ని వందల సంవత్సరాలకు ఒకమారు ఇలాంటి ఒక మహమ్మారి మానవాళిని సంక్షోభంలోకి నెడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అడవుల పరిరక్షణ, జీవవైవిధ్యం..అనేది ఎప్పుడైతే బలహీనమవుతుందో, వైరస్ దాడులు మాన వాళిపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని 'ఐక్యరాజ్యసమితి గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్-2021' అభిప్రాయపడింది. ఉపాధి కోసం, ఆహారం కోసం..పేదలు, అణగారినవర్గాలు, వలస కార్మికులు మళ్లీ అడవుల్ని ఆశ్రయి స్తున్నారని, ప్రభుత్వాల వైపు నుంచి సహకారం, సంక్షేమ కార్యక్రమాల తోడ్పాటు లేకనే ఇలా జరుగుతోందని నివేదిక తెలిపింది. అడవుల్ని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షి ంచుకుంటే...ముందు ముందు తలెత్తే వైరస్ సంక్షోభాల్ని మానవాళి ఎదుర్కోగలదని నివేదిక సూచించింది.
160కోట్లమందిపై ప్రభావం
పర్యావరణ మార్పులు, జీవ వైవిధ్య దెబ్బతినటం, భూతాపం వంటివి 'మహమ్మారి' విజృంభణను మరింత పెంచుతోందని నివేదికలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కాబట్టి మహమ్మారిని ప్రపంచ మానవాళి పూర్తిస్థాయిలో ఎదుర్కోవాలంటే, అడవుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అలాగే ఈ కరోనా సంక్షోభ ప్రభావం అడవులపై ఆధారపడి జీవిస్తున్న 160కోట్లమందిపైనా తీవ్రంగా పడింది. ఉపాధి సమస్యలో, ప్రజా ఆరోగ్య సేవలు పొందటంలో ప్రభుత్వాల నుంచి సహకారం అందటం లేదని ఐరాస నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, కనీస సేవలు అన్నీ స్తంభించిపోయాయని తెలిపింది.
ప్రాణవాయువుకు ఆధారం..
కొన్ని వేల సంవత్సరాలుగా మానవాళికి ఆర్థిక, సామాజిక రక్షణ కవచంగా అడువులు నిలుస్తున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అడువులు, వాటి సమీప ప్రాంతాల్లో 160కోట్లమంది బతుకుతున్నారు. వారి జీవనోపాధి ప్రత్యక్షంగా అడవులతో ముడిపడివుంది. ప్రపంచ మానవాళికి శుభ్రమైన గాలి, నీరు అందిస్తున్నాయి. భూమిపై నివసించే జీవిరాశిలో 80శాతం అడవుల్లో తలదాచుకుంటాయి. భూతాపాన్ని నియంత్రించేది, కార్బన్ ఉద్గారాల్ని స్వీకించేవి అడువులే. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొవటం కోసం మానవుడు తయారుచేసుకుంటున్న ఔషధాలకు ఆధారం అడవులే. శానిటైజర్ల తయారీలో వాడే ఇథనాల్ ప్రధానంగా అడవుల నుంచే సేకరిస్తారు. ప్రస్తుత కరోనా సంక్షోభమేకాదు, భవిష్యత్తులో పుట్టే వైరస్లను మానవుడు ఎదుర్కొవాలంటే 'అడవులు' ముఖ్య భూమిక వహిస్తాయని ఐరాస తాజా నివేదిక తేల్చింది.
అసమానతలు మరింత పైకి..
పేదలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతిపై కోవిడ్-19 సంక్షోభం ప్రభావం ఎక్కువగా పడింది. సామాజికంగా, ఆర్థికంగా అసమానతల్ని ఈ సంక్షోభం మరి ంత పెంచింది.ప్రజలజీవనోపాధిని దెబ్బతీసి..పేదరికంలోకి వెళ్లేట్టు చేసింది. అయితే ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ప్రత్యక్షంగా ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తోంది.అయితే పర్యావరణ మార్పులు, జీవ వైవిధ్యంలో సంక్షోభం కూడా ప్రపంచాన్ని తీవ్రంగా కుది పేస్తోంది. ఈ సంక్షోభం పైకి పెద్దగా కనిపించటం లేదు, వైరస్ అంత మొందించే పోరాటం ఎలాగైతే జరుగు తుందో...అడవుల పరిరక్షణకు కూడా ప్రపంచ మానవాళి కృషి చేయాలని మేధావులు,పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
అడవులతో ముడిపడి ఉంది..
ఐరాస తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ జీడీపీ 2020లో 4.3శాతం క్షీణించింది. 1930లో మహామాంద్యం తర్వాత ప్రపంచ జీడీపీ ఈ స్థాయిలో పడిపోవటం ఇదే మొదటిసారి. భూతాపం, పర్యావరణ మార్పులు, అడవుల పరిరక్షణ...నేపథ్యంలో ప్రపంచానికి ఎదురైనా సవాళ్లను పట్టించుకోకపోవటం వల్లే..నేటి పరిస్థితి వచ్చిందని ఐరాస నివేదిక తెలుపుతోంది. ప్రపంచ జనాభాలో సుమారుగా 25శాతం (160కోట్లమంది) జనాభా అడవులపై ఆధారపడి జీవిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరి జీవనోపాధి, నిత్యావసరాలు, ఆదాయం..అన్నీ అడవులతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు సవాన్నా అటవీ ప్రాంతాల్లో (ద.అమెరికా, ఆఫ్రికా, ఇండియా, మయన్మార్లలోని ప్రాంతాలు) నివసించే వారిలో పేదరికం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలోని 40శాతం ప్రజలు ఆహారం కోసం, ఉపాధి కోసం అడవుల్ని నమ్ముకున్నారు.