Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై ఏచూరి ఆగ్రహం
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి ఒకవైపు తీవ్రంగా విజృంభిస్తుంటే మరోవైపు దేశం లోని ప్రజానీకానికి ప్రాణవాయువు (ఆక్సిజన్) కూడా అందించలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఇంతటి కీలక సమయంలో కూడా మోడీ ప్రభుత్వం సెంట్రల్ విస్టాని కొనసాగిస్తుండటం దారుణమన్నారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమంలో ట్వీట్ చేశారు. ఆక్సిజన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగడంతో దేశంలోని ప్రజానీకమంతా కరోనా బారినపడి చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎం మోడీ మాత్రం ప్రజాధనాన్ని ఇంకా తన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు వెచ్చించడాన్ని నేరపూరిత ఘటనగా ఏచూరి అభివర్ణించారు. ఈ ప్రాజెక్టును తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. వార్షిక బడ్జెట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేటాయించిన విధంగా రూ.35 వేల కోట్లని అందుకోసం ఖర్చు చేయాలన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌ను కేంద్ర ప్రభుత్వమే అందజేయాలన్నారు. కానీ, మోడీ సర్కారు ఆ పని చేయడం లేదని విమర్శించారు. ఇటీవల ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాధానం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం చివరగా మార్చిలోనే వ్యాక్సినేషన్లని కోనుగోలు చేసిందనీ... ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ ఆర్డర్లు ఇవ్వనున్నారని చెప్పడం ఏంటని నిలదీశారు. ఇదివరకు కేంద్రం ఇచ్చిన ఆర్డర్లు కూడా కేవలం 35.1 కోట్లు మాత్రమేనని అన్నారు. ఇటీవల వెలువడిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు ఉత్సాహానిచ్చే అంశమని సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా బీజేపీ వ్యతిరేక శక్తులకు ఈ ఎన్నికల ఫలితాలు మరింత ఉపమోగపడతాయని అన్నారు. కేరళలో కూడా రెండోసారి లెఫ్ట్ ఫ్రంట్, బెంగాల్లో అధికార తణమూల్, తమిళనాడులో పదేండ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి రావడం, అస్సాంలో బీజేపీ గెలిచినా ప్రతిపక్ష పార్టీ కూడా గట్టి పోటీనివ్వడం పరిశీలించదగ్గ అంశాలన్నారు. బీజేపీ ఉపయోగించిన మనీ పవర్, మజిల్ పవర్, మతం అన్ని దారుణంగా ప్రజాక్షేత్రంలో చిత్తయినట్టు ఏచూరి చెప్పారు. కేరళలో గతం కంటే కూడా తమ పార్టీ సీపీఐ(ఎం) నేతత్వంలోని ఎల్డీఎఫ్కు అధిక సీట్లు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఆ ప్రభుత్వం చేసిన అద్భుత ప్రజాసేవకు నిదర్శనమని ఏచూరి పేర్కొన్నారు.